Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTBandla Ganesh | పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ఆందోళన.. భావోద్వేగ ట్వీట్ చేసిన బండ్ల గణేష్

Bandla Ganesh | పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ఆందోళన.. భావోద్వేగ ట్వీట్ చేసిన బండ్ల గణేష్

-

Chat on WhatsApp

Bandla Ganesh: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన తాజా సమాచారం అభిమానులను ఆందోళనకు గురిచేసింది. వైద్య పరీక్షల్లో ఆయన రెండు భుజాల్లోని రొటేటర్ కఫ్ భాగంలో తీవ్ర సమస్య ఉన్నట్లు, కండరాలు దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించినట్లు తెలిసింది. పరిస్థితిని పరిశీలించిన నిపుణులు శస్త్రచికిత్స అవసరమని సూచించినప్పటికీ, ప్రస్తుతం అధికార బాధ్యతలకు ప్రాధాన్యం ఇస్తూ పవన్ చికిత్సను కొంతకాలం వాయిదా వేసినట్లు సమాచారం.

రాష్ట్ర పరిపాలన, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అవసరం ఉండటంతో శారీరక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆయన విధులను కొనసాగిస్తున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. గతంలో సినిమాల చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదాల కారణంగా భుజాలు, నడుము భాగాల్లో వచ్చిన గాయాల ప్రభావం ఇప్పటికీ కొనసాగుతున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ విస్తృతంగా చర్చకు దారితీసింది. ఎన్నో సంవత్సరాలుగా తీవ్రమైన నొప్పిని భరిస్తూనే చిరునవ్వుతో ప్రజల మధ్య ఉంటున్న పవన్ కళ్యాణ్ మానసిక ధైర్యం అసాధారణమని ఆయన పేర్కొన్నారు. ‘గబ్బర్ సింగ్’ చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదాన్ని గుర్తు చేస్తూ, నిర్మాతకు నష్టం కలగకుండా షూటింగ్ పూర్తి చేసిన పవన్ అంకితభావాన్ని కొనియాడారు.

పవన్ కళ్యాణ్ జీవితంలో ఇకపై ఆరోగ్యం, ఆనందం మాత్రమే ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని బండ్ల గణేష్ తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

https://twitter.com/ganeshbandla/status/2071786777204146630?s=20

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp