హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills by-election) ఓట్ల లెక్కింపు పనులు పూర్తిగా సిద్ధమయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ప్రకటించారు. నవంబర్ 14వ తేదీ ఉదయం 8 గంటలకు యూసఫ్ గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్(election counting) ప్రారంభమవుతుందని తెలిపారు.
మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరగనుందని చెప్పారు. ఈసారి నోటా సహా 59 మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున, ఎన్నికల సంఘం అనుమతితో 42 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
గరిష్టంగా 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుందని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియను ఈసీఐ సాధారణ పరిశీలకులు, బృందం పర్యవేక్షిస్తుందని వెల్లడించారు.
ALSO READ:శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రెండో అతిపెద్ద కార్గో విమానం | Shamshabad Airport cargo plane
కౌంటింగ్ కోసం 186 మంది సిబ్బందిని నియమించామని, వీరిలో సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు ఉన్నారని తెలిపారు. LED స్క్రీన్‌లు మరియు EC యాప్ ద్వారా ఫలితాలు అప్డేట్ అవుతాయని చెప్పారు. అభ్యర్థులు, వారి ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బందికే కేంద్రంలో ప్రవేశం ఉంటుందని హెచ్చరించారు.
భద్రతా చర్యలపై జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ మాట్లాడుతూ, రేపు 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
