Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeTelanganaHyderabadజగద్గిరిగుట్టలో కత్తిపోట్లు.. పాత కక్షలతో స్నేహితుడి హ*త్య

జగద్గిరిగుట్టలో కత్తిపోట్లు.. పాత కక్షలతో స్నేహితుడి హ*త్య

-

Chat on WhatsApp

హైదరాబాద్‌ నగరంలోని జగద్గిరిగుట్ట ప్రాంతంలో పాత కక్షలతో ముగ్గురు స్నేహితుల మధ్య గొడవ కత్తిపోట్లకు దారితీసింది. ఈ ఘటన స్థానికులను ఒక్కసారిగా భయాందోళనలకు గురిచేసింది. బాలానగర్‌ ఏసీపీ (Nageshreddy) తెలిపిన వివరాల ప్రకారం, రోషన్‌సింగ్‌ (25)(Rangareddy) రౌడీషీటర్‌. సోమయ్యనగర్‌కు చెందిన బాలశౌరెడ్డి (23) కూడా పాత నేరస్థుడే.

పదిహేనురోజుల క్రితం రోషన్‌సింగ్‌ తన స్నేహితులతో కలిసి ఓ ట్రాన్స్‌జెండర్‌పై అత్యాచారం చేశాడు. డబ్బుల వివాదంతో బాధితురాలు బాలానగర్‌ పోలీస్‌స్టేషన్‌లో రోషన్‌సింగ్‌ గ్యాంగ్‌పై కేసు నమోదు చేయించగా, రోషన్‌సింగ్‌ దీనికి బాలశౌరెడ్డినే కారణమని అనుమానించాడు.

బుధవారం సాయంత్రం రోషన్‌సింగ్‌, బాలశౌరెడ్డి, ఆదిల్‌, మహ్మద్‌ మద్యం సేవిస్తుండగా పాత విషయాలు తలెత్తడంతో వాగ్వాదం చెలరేగింది. ఆ సమయంలో మహ్మద్‌ రోషన్‌ను పట్టుకోగా, బాలశౌరెడ్డి చేతిలోని కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. గాయాలతో రోషన్‌సింగ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

ఘటన అనంతరం బాలశౌరెడ్డి, ఆదిల్‌ బైక్‌పై పరారయ్యారు. సంఘటన స్థలంలో ఉన్న మనూను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tgpsc town planning department recruitment notification for 10 posts in telangana

TGPSC | తెలంగాణలో మరో జాబ్ అలర్ట్.. టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టుల భర్తీ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా మరో...
- Advertisement -
Chat on WhatsApp