తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో గత వైసీపీ ప్రభుత్వ కాలంలో టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy)ని సిట్ నిన్న దాదాపు 12 గంటలపాటు విచారించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 10:30 వరకు సాగింది.
ALSO READ:Dhanam Nagender Resignation | రాజీనామా చేసే యోచనలో ఖైరతాబాద్ MLA
సుబ్బారెడ్డి మాజీ పర్సనల్ అసిస్టెంట్ చిన్నప్ప ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా విచారణ కొనసాగినట్లు తెలుస్తోంది. మైసూరు ల్యాబ్ కల్తీ నెయ్యి నిర్ధారించినప్పటికీ, సంబంధిత కంపెనీల కాంట్రాక్టులు ఎందుకు రద్దు కాలేదని అధికారులు వివరాలు కోరారు.
ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, వైష్ణవి డైరీ వంటి సంస్థలకు 2024 వరకు కాంట్రాక్టులు కొనసాగడానికి కారణాలపై SIT ప్రత్యేకంగా ఆరా తీసింది. టెండర్ల నిబంధనల్లో జరిగిన మార్పులపై కూడా ప్రశ్నల వర్షం కురిపించారు.
ఈ కేసులో తనకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని, టెండర్లు, నాణ్యత తనిఖీలు అన్నీ అధికారుల పరిధిలోనే జరిగాయని సుబ్బారెడ్డి SITకు తెలిపినట్లు సమాచారం.
