ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS JAGAN) ఈ నెల 21వ తేదీలోగా హైదరాబాద్‌లోని సీబీఐ(CBI) కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ఇటీవల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన మెమోను జగన్ ఉపసంహరించుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే, అక్టోబర్‌లో యూరప్ పర్యటనకు వెళ్లేందుకు కోర్టు అనుమతిచ్చింది.
also read:India Climate Risk Report:ప్రకృతి విపత్తులు ముప్పు..30 ఏళ్లలో 80వేల మంది మృతి!
అయితే తిరిగి వచ్చిన తర్వాత నవంబర్ 14న హాజరుకావాలని షరతు విధించింది. ఈ గడువు సమీపించడంతో, ఈ నెల 6న జగన్ మినహాయింపు కోరుతూ మెమో దాఖలు చేశారు. మంగళవారం విచారణలో సీబీఐ దీనికి వ్యతిరేకంగా స్పందిస్తూ, బెయిల్ షరతుల ప్రకారం ఆయన ప్రతి విచారణకు తప్పనిసరిగా హాజరుకావాల్సిందేనని తెలిపింది.
జగన్ తరఫు న్యాయవాది జి. అశోక్‌రెడ్డి వాదిస్తూ, హైకోర్టు గతంలోనే హాజరు మినహాయింపు ఇచ్చిందని గుర్తుచేశారు. భద్రతా కారణాలతోనే మినహాయింపు కోరామని, కోర్టు హాజరుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.
చివరగా, ఈ నెల 21లోగా హాజరవుతామని కోర్టుకు హామీ ఇచ్చారు. దీనిపై సీబీఐ కోర్టు గత మెమోను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
