Tuesday, June 30, 2026
Chat on WhatsApp
HomeTechnology NewsX App Update | బుక్‌మార్క్స్‌కు గుడ్‌బై.. ఎక్స్‌లో కొత్త హిస్టరీ ఫీచర్ వచ్చేసింది

X App Update | బుక్‌మార్క్స్‌కు గుడ్‌బై.. ఎక్స్‌లో కొత్త హిస్టరీ ఫీచర్ వచ్చేసింది

-

Chat on WhatsApp

X App Update: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X వినియోగదారుల కోసం కొత్తగా ‘హిస్టరీ’ (History) అనే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త అప్‌డేట్ ద్వారా యూజర్లు తమకు నచ్చిన కంటెంట్‌ను ఒకేచోట సులభంగా చూడగలుగుతారు. ప్రస్తుతం ఈ ఫీచర్ iOS డివైస్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది.

X ప్రొడక్ట్ హెడ్ నికిటా బియర్ తెలిపిన వివరాల ప్రకారం, యూజర్లు సేవ్ చేసుకున్న పోస్టులు, చూసిన వీడియోలు, చదివిన ఆర్టికల్స్‌ను మళ్లీ వెతకాల్సిన అవసరం లేకుండా ఈ ఫీచర్ సహాయపడుతుంది. ఇప్పటివరకు యాప్‌లో ఉన్న ‘Bookmarks’ ఆప్షన్‌ను పూర్తిగా ‘History’గా మార్చారు.

ఈ కొత్త సెక్షన్‌లో బుక్‌మార్క్స్, లైక్స్, వీడియోలు, ఆర్టికల్స్ అనే నాలుగు విభాగాలు ఉంటాయి. యూజర్ యాక్టివిటీ ఆధారంగా కంటెంట్ ఆటోమేటిక్‌గా సేవ్ అవుతుంది. అయితే ఈ డేటా పూర్తిగా వ్యక్తిగతం అని, ఇతరులకు కనిపించదని కంపెనీ స్పష్టం చేసింది.

ఈ ఫీచర్‌తో X యాప్ ఇప్పుడు ఒక రకంగా వెబ్ బ్రౌజర్ లేదా పర్సనల్ న్యూస్ రీడర్‌లా పనిచేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లాంగ్ ఫార్మ్ ఆర్టికల్స్, బిజినెస్ మరియు క్రియేటర్ పోస్టులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ అప్‌డేట్ మరింత ఉపయోగకరంగా మారనుంది.

అల్గోరిథమ్ మార్పులు, AI ఆధారిత ఫీచర్ల వల్ల బయటి వెబ్‌సైట్లకు ట్రాఫిక్ తగ్గుతున్న సమయంలో, యూజర్లను ఎక్కువసేపు ప్లాట్‌ఫామ్‌లో ఉంచే దిశగా X ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

india women's cricket team qualifies for los angeles 2028 olympics

2028 Los Angeles Olympics | టీ20 ప్రపంచకప్‌లో నిరాశ.. ఒలింపిక్స్‌కు అర్హతతో భారత...

2028 Los Angeles Olympics: టీ20 ప్రపంచకప్‌ 2026లో ఆశించిన స్థాయిలో రాణించలేక గ్రూప్ దశలోనే టోర్నీకి వీడ్కోలు పలికిన భారత మహిళల క్రికెట్ జట్టుకు ఇప్పుడు ఒక శుభవార్త లభించింది. ప్రపంచకప్‌లో...
- Advertisement -
Chat on WhatsApp