Sunday, March 22, 2026
Google search engine
HomeInterNationalWhatsApp Shock to Users | వాట్సాప్‌లో ఫ్రీ సేవలకు ముగింపు? యూజర్లలో ఆందోళన

WhatsApp Shock to Users | వాట్సాప్‌లో ఫ్రీ సేవలకు ముగింపు? యూజర్లలో ఆందోళన

-

Google search engine

WhatsApp Paid Subscription: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు తప్పనిసరి యాప్‌గా మారిన వాట్సాప్‌ వినియోగానికి ఇక డబ్బులు చెల్లించాల్సి వస్తుందా అనే ప్రశ్నలు వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ఈ మెసేజింగ్ యాప్ త్వరలో పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ మోడల్ వైపు అడుగులు వేయొచ్చన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నివేదికల ప్రకారం, వాట్సాప్ తాజా వెర్షన్ 2.26.3.9 యాప్ కోడ్‌లో కొత్త సంకేతాలు కనిపించినట్లు సమాచారం. స్టేటస్‌, ఛానెల్స్ విభాగాల్లో కనిపించే ప్రకటనలను తొలగించేందుకు ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌కు సంబంధించిన స్ట్రింగ్‌లు గుర్తించినట్లు చెబుతున్నారు.

దీని ఆధారంగా భవిష్యత్తులో ప్రకటనల రహిత (Ad-Free) అనుభవం కోసం యూజర్ల నుంచి ఫీజు వసూలు చేసే అవకాశం ఉందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే, ఈ అంశంపై ఇప్పటివరకు వాట్సాప్ గానీ, మాతృసంస్థ మెటా గానీ అధికారిక ప్రకటన చేయలేదు. గతంలో కూడా స్టేటస్‌, ఛానెల్స్‌లో ప్రకటనలపై ప్రయోగాలు చేయగా, యూజర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.

ప్రస్తుతం ఈ పెయిడ్ మోడల్ పూర్తిగా ఐచ్ఛికమా లేదా అందరికీ వర్తిస్తుందా అనే అంశంపై స్పష్టత లేదు. వాట్సాప్ ఈ దిశగా ముందుకు వెళ్తే, రాబోయే రోజుల్లో అధికారిక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

also read:గణతంత్ర దినోత్సవాన మావోయిస్టుల దుశ్చర్య.. 11 మంది జవాన్లకు గాయాలు

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine