HomeInterNationalUSA-Iran: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు.. రంగంలోకి యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్

USA-Iran: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు.. రంగంలోకి యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్

-

Chat on WhatsApp

USA-Iran: పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన అత్యాధునిక యుద్ధ విమాన వాహక నౌక “యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్”(USS Abraham Lincoln) ఈ ప్రాంతానికి చేరుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. దీనితో ఇరాన్‌పై అమెరికా ఎప్పుడైనా సైనిక చర్యలకు దిగవచ్చన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

అబ్రహం లింకన్‌తో పాటు “యూఎస్‌ఎస్ ఫ్రాంక్ ఈ. పీటర్సన్ జూనియర్“, “యూఎస్‌ఎస్ స్ప్రూయాన్స్” డెస్ట్రాయర్లు, అలాగే “యూఎస్‌ఎస్ మిషెల్ మార్ఫీ” కూడా పశ్చిమాసియా జలాలకు చేరుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (US Central Command) అధికారికంగా ధ్రువీకరించింది.

ప్రాంతీయ భద్రత, స్థిరత్వాన్ని కాపాడటమే ఈ నౌకల మోహరింపు లక్ష్యమని వెల్లడించింది. ఈ నౌకాదళం ప్రస్తుతం ఇరాన్ సరిహద్దులకు సమీపంలోని అరేబియా సముద్రం కాకుండా హిందూ మహాసముద్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇప్పటికే ఉన్న అమెరికా సైనిక బలానికి మరింత బలం చేకూరినట్లైంది.

ఇదిలా ఉండగా పశ్చిమాసియాకు అదనపు ఫైటర్ జెట్‌లు, మిలిటరీ కార్గో విమానాలను తరలించే యోచనలో పెంటగాన్ ఉందని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

మరోవైపు ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. ఈ ఆందోళనలకు మద్దతుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా స్పందించారు. అదే సమయంలో, ఇరాన్ చర్చలకు ముందుకొస్తే అమెరికా కూడా చర్చలకు సిద్ధంగా ఉందని అమెరికా ఉన్నతాధికారులు తెలిపారు.

also read:WhatsApp Shock to Users | వాట్సాప్‌లో ఫ్రీ సేవలకు ముగింపు? యూజర్లలో ఆందోళన

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Lionel Messi | మెస్సీ ఇంట తీవ్ర విషాదం.. తండ్రి జార్జ్ మెస్సీ కన్నుమూత

Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ తండ్రి, ఆయన కెరీర్‌కు బలమైన అండగా నిలిచిన జార్జ్ మెస్సీ (68)...
- Advertisement -
Chat on WhatsApp