Nana Kutty Trailer: కుటుంబ బంధాలు, భావోద్వేగాలకు యాక్షన్ జోడిస్తే వెండితెరపై ఓ ప్రత్యేకమైన కథ సిద్ధమవుతుంది. అలాంటి కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది విజయ్ ఆంటోని నటిస్తున్న తాజా చిత్రం ‘నాన్న కుట్టి’. ము. మారన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్ ఆంటోని ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బేబీ లితన్య శివబాలన్, ప్రీతి అస్రానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లను వేగవంతం చేసిన చిత్రబృందం మంగళవారం ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ప్రేమ, అనుబంధం, వారి జీవితాల్లో ఎదురయ్యే సంఘర్షణలను ట్రైలర్‌లో ఆసక్తికరంగా చూపించారు. భావోద్వేగ సన్నివేశాలతో పాటు ఉత్కంఠ రేపే యాక్షన్ ఘట్టాలు కూడా సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. మొత్తానికి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు యాక్షన్‌ను మేళవించిన ‘నాన్న కుట్టి’ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే నవంబర్ 27 వరకు వేచి చూడాల్సిందే.
ALSO READ: Vaibhav Suryavanshi Double century | అదేం బాదుడు సామీ.. బౌలర్లకు చుక్కలు చూపించిన వైభవ్ సూర్యవంశీ
