Thursday, July 9, 2026
Chat on WhatsApp
HomeOthersవంశీ బెయిల్ పిటిషన్‌కి హైకోర్టులో నిరాశ

వంశీ బెయిల్ పిటిషన్‌కి హైకోర్టులో నిరాశ

-

Chat on WhatsApp

వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో నిరాశ ఎదురైంది. స్థలం ఆక్రమణ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు ఈ రోజు విచారణ జరిపింది. అయితే కేసుకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాలు అవసరమని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలియజేయడంతో, హైకోర్టు కేసు విచారణను వారం రోజుల పాటు వాయిదా వేసింది.

ప్రస్తుతం వంశీ విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. స్థల ఆక్రమణ కేసుతో పాటు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించిన కేసు కూడా ఆయనపై నమోదు అయ్యింది. ఈ కేసుల్లో ఆరోపణలతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

ఇంకా, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కూడా వంశీపై కేసు నమోదై ఉంది. ఈ కేసులోనూ ఆయనపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ మూడూ కేసులు ప్రస్తుతం విచారణలో ఉన్నాయని, ప్రతి కేసులో వంశీ జైలులోనే ఉన్నారు. అన్ని కేసులపై సమగ్ర విచారణ అనంతరం తదుపరి నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో వంశీకి ఈసారి బెయిల్ రాకపోవడంతో ఆయన న్యాయపరమైన చిక్కుల్లో మరింత దిగజారినట్లు కనిపిస్తోంది. కోర్టులో ఆయన తరఫున న్యాయవాదులు వినిపించిన వాదనలు ఈ దశలో ఫలించకపోవడం వంశీకి పెద్ద ఎదురు దెబ్బగానే భావించబడుతోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

LPG cylinders were swept away after floodwaters entered an HPCL bottling plant in Maharashtra

LPG cylinders | మహారాష్ట్రలో భారీ వర్షాల బీభత్సం.. వరదలో కొట్టుకెళ్లిన LPG సిలిండర్లు

LPG cylinders: మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు పలు జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నదులు, వాగులు పొంగిపొర్లడంతో అనేక ప్రాంతాలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో రాయగడ్ జిల్లాలోని పారిశ్రామిక...
- Advertisement -
Chat on WhatsApp