Ujjaini Mahankali Rangam 2026: సికింద్రాబాద్‌లో జరుగుతున్న ఉజ్జయిని మహంకాళి బోనాల మహోత్సవాల్లో అత్యంత కీలక ఘట్టమైన రంగం కార్యక్రమం భక్తుల నడుమ భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. రెండో రోజు వేడుకల్లో ఉదయం 9.55 గంటలకు పచ్చికుండపై నిలబడి మాతంగి స్వర్ణలత అమ్మవారి పూనకంతో భవిష్యవాణి(Matangi Swarnalatha Predicts) వినిపించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందారు. రంగంలో వెల్లడించిన భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత పలు కీలక అంశాలను ప్రస్తావించారు. తనకు విగ్రహ ప్రతిష్ఠ చేయకపోవడంతో అమ్మవారు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు.
అలాగే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రకృతి విపత్తుల కారణంగా ప్రాణనష్టం సంభవించే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అమ్మవారి అనుగ్రహంతో అన్ని విపత్తులు తొలగిపోవాలని ప్రార్థించాలని సూచించారు. ప్రతి ఏడాది బోనాల సందర్భంగా నిర్వహించే రంగం కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. అమ్మవారి భవిష్యవాణిని వినేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. ఈసారి కూడా మాతంగి స్వర్ణలత వెల్లడించిన ప్రవచనం భక్తుల్లో ఆసక్తిని రేకెత్తించడంతో పాటు చర్చనీయాంశంగా మారింది.
ALSO READ: Flipkart Food Delivery | ఇక ఫుడ్ కూడా ఫ్లిప్‌కార్ట్‌లోనే.. ఫుడ్ డెలివరీ రంగంలో గ్రాండ్ ఎంట్రీ!








