HomeNationalUIDAI | ఆధార్ కార్డు కొత్త రూల్... ఇకపై ఆధార్ బర్త్ ప్రూఫ్ కాదు

UIDAI | ఆధార్ కార్డు కొత్త రూల్… ఇకపై ఆధార్ బర్త్ ప్రూఫ్ కాదు

-

Chat on WhatsApp

యూఐడీఏఐ (UIDAI) ఆధార్ కార్డు వినియోగంపై కీలక మార్పును ప్రకటించింది. ఇప్పటివరకు ఆధార్‌ను గుర్తింపు కార్డు మాత్రమే కాకుండా పుట్టిన తేదీ నిర్ధారణ కోసం కూడా చాలామంది ఉపయోగిస్తూ వచ్చారు. అయితే ఇకపై ఆధార్‌ను పుట్టిన తేదీకి ప్రామాణిక పత్రంగా పరిగణించకూడదని యూఐడీఏఐ స్పష్టం చేసింది. ఆధార్ ప్రధానంగా వ్యక్తి గుర్తింపు మరియు నివాసాన్ని ధృవీకరించే పత్రం మాత్రమేనని అధికారులు తెలిపారు.

ఆధార్ దరఖాస్తు లేదా అప్‌డేట్ సమయంలో సమర్పించిన సమాచారంపై ఆధారపడి పుట్టిన తేదీ నమోదు అవుతుందని, సరైన పత్రాలు లేకపోతే డిఫాల్ట్‌గా జనవరి 1ని పుట్టిన తేదీగా చూపించే అవకాశం ఉందని వివరించారు.

ఈ విధంగా నమోదు అయ్యే “డిక్లేర్డ్ డేటా” పూర్తిగా ఖచ్చితమైన జన్మ తేదీని నిర్ధారించదని, అందువల్ల దాన్ని అధికారిక బర్త్ ప్రూఫ్‌గా ఉపయోగించరాదని యూఐడీఏఐ పేర్కొంది.

అయితే ఆధార్ ఇతర సేవల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ఈ-ఆధార్, మాస్క్డ్ ఆధార్, QR కోడ్, ఆఫ్‌లైన్ XML వంటి అన్ని రూపాలు గుర్తింపు మరియు చిరునామా ధృవీకరణ కోసం యథావిధిగా చెల్లుబాటు అవుతాయి.

పుట్టిన తేదీ నిర్ధారణ కోసం అవసరమైతే బర్త్ సర్టిఫికేట్ లేదా విద్యా సర్టిఫికేట్లు ఉపయోగించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు లేదా ఇతర సేవల్లో ఆధార్‌ను ఎలా ఉపయోగించాలనే నిర్ణయం సంబంధిత సంస్థలపై ఆధారపడి ఉంటుందని కూడా యూఐడీఏఐ తెలిపింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Lionel Messi | మెస్సీ ఇంట తీవ్ర విషాదం.. తండ్రి జార్జ్ మెస్సీ కన్నుమూత

Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ తండ్రి, ఆయన కెరీర్‌కు బలమైన అండగా నిలిచిన జార్జ్ మెస్సీ (68)...
- Advertisement -
Chat on WhatsApp