Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeNationalUdhayanidhi Stalin | సనాతన ధర్మ వివాదంపై స్టాలిన్ వివరణ... నా ఉద్దేశం అది కాదు...

Udhayanidhi Stalin | సనాతన ధర్మ వివాదంపై స్టాలిన్ వివరణ… నా ఉద్దేశం అది కాదు ?

-

Chat on WhatsApp

Udhayanidhi Stalin: తమిళనాడు అసెంబ్లీలో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, సనాతన ధర్మాన్ని కించపరచడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.

సమాజంలో ప్రజలను అగ్ర, నిమ్న వర్గాలుగా విభజించే కుల వ్యవస్థను వ్యతిరేకిస్తూ మాట్లాడానని తెలిపారు. ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉండే సమాజం కోసం తాను కృషి చేస్తున్నానని చెప్పారు.

అసెంబ్లీలో తాను పెరియార్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆలోచనలు మరియు సామాజిక న్యాయ సూత్రాల గురించి ప్రస్తావించానని ఉదయనిధి వెల్లడించారు. కుల వివక్ష, అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తానని, ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గబోనని పేర్కొన్నారు.

సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం తమ ఉద్దేశం కాదని, కానీ అసమానతలు మరియు సామాజిక అన్యాయాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.

ఇటీవల తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో ఉదయనిధి “సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉన్న సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి” అని వ్యాఖ్యానించడంతో వివాదం చెలరేగింది. ఆయన వ్యాఖ్యలపై రాజకీయ నాయకులు, హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే తన వ్యాఖ్యల అసలు ఉద్దేశం సామాజిక సమానత్వం గురించి మాత్రమేనని ఉదయనిధి మరోసారి స్పష్టం చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp