TTD Launches AI Chatbot for Devotees | తిరుమల భక్తులకు స్మార్ట్ సేవలు

TTD AI Chatbot for Tirumala Devotees TTD introduces AI Chatbot to simplify services for Tirumala devotees in 13 languages.

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్రీవారి భక్తులకు మరో శుభవార్తను అందించింది. భక్తులకు మరింత సులభమైన సేవలు అందించాలనే లక్ష్యంతో టీటీడీ, అమెజాన్ వెబ్ సర్వీసెస్‌ (AWS) భాగస్వామ్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌బాట్‌ను ప్రవేశపెట్టనుంది.

ఈ ఆధునిక సేవ ద్వారా భక్తులు దర్శనం, వసతి గదుల లభ్యత, విరాళాలు, ఇతర సేవల గురించి క్షణాల్లో సమాచారాన్ని పొందగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల సౌకర్యం కోసం ఈ సేవలు 13 భాషల్లో అందుబాటులో ఉండనున్నాయి.

అంతేకాకుండా, ఫిర్యాదులు, సలహాలు, సూచనలు కూడా ఈ చాట్‌బాట్‌ ద్వారా సులభంగా టీటీడీకి చేరేలా సదుపాయం కల్పించబడుతుంది.

ఈ చాట్‌బాట్‌లో స్పీచ్ టు టెక్ట్స్‌, టెక్ట్స్ టు స్పీచ్‌ ఫీచర్లు కూడా ఉంటాయి, వాటితో వాయిస్ కమాండ్ల ద్వారా సేవలు పొందవచ్చు. ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను టీసీఎస్ అభివృద్ధి చేస్తోందని సమాచారం.

టెక్నాలజీ వినియోగం పెరిగిన ఈ కొత్త అడుగుతో టీటీడీ(TTD) పాలనలో పారదర్శకత, భక్తుల సేవలో వేగం మరింత పెరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *