Billionaire Mantenna Ramalingaraju: తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం ప్రకటించిన ప్రముఖ వ్యాపారవేత్త మంతెన రామలింగరాజు. ఇటీవల ఉదయ్‌పూర్‌లో తన కూతురు నేత్ర వివాహాన్ని అట్టహాసంగా నిర్వహించిన రామలింగరాజు, తిరుమల శ్రీవారికి కూతురు నేత్ర మరియు అల్లుడు వంశీ పేర్లపై రూ.9 కోట్ల విరాళాన్ని అందించారు.
ఈ నిధులను PAC 1, 2, 3 భవనాల ఆధునికీకరణ పనుల కోసం వినియోగించనున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.

రామలింగరాజు తిరుమలకు ఇదే మొదటి పెద్ద విరాళం కాదు. 2012లో కూడా ఆయన రూ.16 కోట్ల విరాళం అందించడం విశేషం. ఇటీవల జరిగిన ఆయన కూతురి వివాహానికి ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ALSO READ:Student Mock Assembly: అమరావతిలో వేడివేడి చర్చ…నిరసనలతో హల్‌చల్
ట్రంప్ కుమారుడు సహా హాలీవుడ్‌లోని పలు ప్రముఖులు కూడా వివాహ కార్యక్రమాలకు చేరుకున్నారు. తిరుమలకు చేసిన తాజా విరాళం మళ్లీ రామలింగరాజు ధార్మిక కార్యకలాపాలపై చూపుతున్న అభిరుచిని వెల్లడించినట్లు భావిస్తున్నారు.
