LIVE
Wednesday, November 25, 2026
LIVE
LIVE

Donald Trump Iran warning | చర్చలు విఫలమైతే యుద్ధమేనా? ఇరాన్‌కు ట్రంప్ డెడ్‌లైన్!

by Bajaswamy
7 views
Donald Trump Iran warning

Donald Trump Iran warning: ప్రపంచ దేశాల చూపు మరోసారి మధ్యప్రాచ్యం వైపు మళ్లింది. అమెరికా, ఇరాన్ మధ్య ఇప్పటికే కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు సానుకూల ఫలితాలను ఇవ్వకపోతే ఇరాన్‌పై సైనిక చర్యలకు వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్‌తో జరుగుతున్న చర్చల తీరుపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అమెరికా, దాని మిత్రదేశాలకు వ్యతిరేకంగా చర్యలు కొనసాగిస్తూనే చర్చల పేరుతో ఇరాన్ కాలయాపన చేస్తోందని ఆరోపించారు. చర్చలకు సిద్ధమంటున్న ఇరాన్ వైఖరిలో నిజాయతీ కనిపించడం లేదని విమర్శించారు. ఇరాన్ అధికారులను ఉద్దేశించి వ్యంగ్య వ్యాఖ్యలు కూడా చేశారు.

మరోవైపు, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి వద్ద పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. అక్కడ అమెరికా నౌకాదళాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా నౌకాదళాన్ని సవాలు చేసే ఇరాన్ నౌకలను సముద్రంలోనే ముంచేస్తామని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఇరాన్‌కు కీలకమైన చమురు ఎగుమతి కేంద్రం ఖార్గ్ ద్వీపం నుంచి నావికా దిగ్బంధాన్ని అధిగమించేందుకు చమురు ట్యాంకర్ల బృందాన్ని సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మొత్తంగా, దౌత్య చర్చలు విఫలమైతే సైనిక ఘర్షణలకు దారితీసే ప్రమాదం కనిపిస్తోంది. ఈ పరిణామాలు అంతర్జాతీయ చమురు మార్కెట్లు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More