Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeTelanganaNalgondaవిద్యుత్ షాక్‌తో బాలుడు ప్రాణాలు కోల్పోయిన విషాదం

విద్యుత్ షాక్‌తో బాలుడు ప్రాణాలు కోల్పోయిన విషాదం

-

Chat on WhatsApp

నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి బాలుడు విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. శనివారం ఉదయం గుర్రంపొడు మండలం మక్కపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది.

గ్రామానికి చెందిన నేతళ్ల కిరణ్, స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. రోజూ కొండమల్లేపల్లిలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి వస్తున్న కిరణ్, శనివారం ఉదయం ఫోన్ రావడంతో డాబాపైకి వెళ్లి మాట్లాడుతున్నాడు.

అతని పొరపాటున డాబా పక్కన ఉన్న విద్యుత్ తీగలను పట్టుకున్నాడు. వెంటనే విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. కుటుంబ సభ్యులు గుండె బద్దలు కొట్టిన ఈ ఘటనను పోలీసులకు తెలిపారు. కిరణ్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tgpsc town planning department recruitment notification for 10 posts in telangana

TGPSC | తెలంగాణలో మరో జాబ్ అలర్ట్.. టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టుల భర్తీ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా మరో...
- Advertisement -
Chat on WhatsApp