Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeTelanganaSiddipetసైలెన్సర్ మార్ఫింగ్ పై ట్రాఫిక్ పోలీసులు చర్యలు

సైలెన్సర్ మార్ఫింగ్ పై ట్రాఫిక్ పోలీసులు చర్యలు

-

Chat on WhatsApp

గత కొన్ని రోజుల నుంచి వాహనాల్లో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు వాడే వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో 53 సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించి నష్టం చేయడమే కాక, సైలెన్సర్ మార్ఫింగ్ చేస్తూ శబ్ద కాలుష్యాన్ని పెంచే వారికి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్ మాట్లాడుతూ, వాహనాలు కొనుగోలు చేసే సమయంలో ఆర్టీవో నిబంధనల ప్రకారం సైలెన్సర్ ఉంటుంది. అయితే కొంతమంది వ్యక్తులు శబ్దం పెరిగే సైలెన్సర్లను మార్చి, శబ్ద కాలుష్యాన్ని పెంచుతారు. ఈ కారణంగా వీరిపై ప్రత్యేక నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు.

సంబంధిత వాహన యజమానులకు సరైన సైలెన్సర్లను కొనుగోలు చేయించి, వాహనాలకు వాటిని ఫిట్ చేయించారు. ఈ రోజున, 53 సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో రోడ్డు రోలర్‌తో డ్యామేజ్ చేయడం జరిగింది.

సాధారణంగా, ఎవరైనా శబ్ద కాలుష్యాన్ని కలిగించే సైలెన్సర్ వాడితే, చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి, వాహన యజమానులను జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tgpsc town planning department recruitment notification for 10 posts in telangana

TGPSC | తెలంగాణలో మరో జాబ్ అలర్ట్.. టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టుల భర్తీ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా మరో...
- Advertisement -
Chat on WhatsApp