Friday, February 27, 2026
No menu items!
Google search engine
HomeENTERTAINMENTThe Kerala Story 2 | ది కేరళ స్టోరీ 2కు ఎదురుదెబ్బ...విడుదలపై హైకోర్టు స్టే

The Kerala Story 2 | ది కేరళ స్టోరీ 2కు ఎదురుదెబ్బ…విడుదలపై హైకోర్టు స్టే

- Advertisement -
Google search engine

The Kerala Story 2: విడుదలకు ఒక్కరోజు ముందే ‘The Kerala Story 2’ చిత్రానికి న్యాయపరమైన అడ్డంకి ఎదురైంది. ప్రచార చిత్రంలో కేరళ రాష్ట్రాన్ని తప్పుగా ప్రతిబింబించారని, మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసే అంశాలు ఉన్నాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై కేరళ హై కోర్ట్ (Kerala High Court) విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా Central Board of Film Certification (CBFC) సర్టిఫికేషన్ విధానంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. జస్టిస్ కురియన్ థామస్ చిత్రాన్ని పునఃపరిశీలించాలని సీబీఎఫ్‌సీకి సూచిస్తూ, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విడుదలపై స్టే విధించారు.

2023లో వివాదాల మధ్య విడుదలైన ‘The Kerala Story’కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. కామాఖ్యా నారాయణ్ సింగ్ దర్శకత్వంలో, విపుల్ అమృత్‌లాల్ షా నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంలో ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రలు పోషించారు.

ప్రేమ పేరుతో మోసపోయి కుటుంబాలను వదిలి వెళ్లిన కొందరు యువతులు అనంతరం ఎదుర్కొనే కఠిన వాస్తవాలను కథగా తీసుకున్నట్టు చిత్రబృందం పేర్కొంది.

‘ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్’ పేరుతో ఫిబ్రవరి 27న విడుదల చేయనున్నట్లు ప్రకటించినా, హైకోర్టు ఉత్తర్వులతో ప్రస్తుతం విడుదల వాయిదా పడింది. ఈ పరిణామం మరోసారి చిత్ర పరిశ్రమలో సెన్సార్ విధానాలపై చర్చకు దారితీసింది.

ALSO READ:Telangana | ఒకే జిల్లాకు గవర్నమెంట్ హోదాలో భార్య, భర్త

- Advertisement -
Google search engine
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular