Saturday, March 28, 2026
Chat on WhatsApp
HomeFilms Newsఈ నగరానికి ఏమైంది 2 త్వరలో....కొత్త హీరో ఎవరో తెలుసా ?

ఈ నగరానికి ఏమైంది 2 త్వరలో….కొత్త హీరో ఎవరో తెలుసా ?

-

Chat on WhatsApp

Tharun Bhascker:టాలీవుడ్ కల్ట్ క్లాసిక్ మూవీ ‘ఈ నగరానికి ఏమైంది’ (ENE)కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘ENE 2’పై తాజాగా కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. దర్శకుడు తరుణ్ భాస్కర్ సోషల్ మీడియాలో చేసిన భావోద్వేగ పోస్ట్‌తో ఈ ప్రాజెక్ట్‌పై స్పష్టత వచ్చింది.

మొదటి భాగంలో ‘కార్తీక్’ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు సుశాంత్ రెడ్డి వ్యక్తిగత కారణాల వల్ల ఈ సీక్వెల్‌లో నటించడం లేదని ఆయన వెల్లడించారు.

సుశాంత్ లేకుండా సినిమా అదే ఫీల్ ఇస్తుందా అని తాను స్క్రిప్ట్‌ను మళ్లీ పరిశీలించుకున్నానని తరుణ్ తెలిపారు.

అయితే, ఈ కథ తన స్నేహాల నుంచి పుట్టినదని, అందుకే అదే ప్రామాణికతతో ముందుకు వెళ్తున్నానన్నారు. సుశాంత్ లేకపోయినా, సినిమాలో ‘కార్తీక్’ పాత్ర ప్రయాణం మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

also read:National Electricity Policy 2047: కరెంటు ఛార్జీలపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు


ఇదే సమయంలో ‘హిట్’ ఫ్రాంచైజీ, ‘లక్కీ భాస్కర్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు “శ్రీనాథ్ మాగంటి” ఈ సీక్వెల్‌లో కీలక పాత్రలో నటించనున్నారనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

సుశాంత్ ప్లేస్‌లో ‘కార్తీక్’ పాత్రనే శ్రీనాథ్ పోషిస్తారా, లేక కొత్త పాత్రలో కనిపిస్తారా అన్నది ఇంకా సస్పెన్స్‌గా ఉంది.

ఇక ‘యానిమల్’ వంటి భారీ బాలీవుడ్ చిత్రంలో నటించిన అనుభవంతో శ్రీనాథ్‌పై అంచనాలు పెరిగాయి. ‘ద బాయ్స్’ గ్యాంగ్ మళ్లీ తెరపై కనిపించనుండటంతో ENE 2పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

telangana cm revanth reddy launching tholi mudda breakfast scheme for anganwadi children in assembly premises

Anganwadi Breakfast Scheme | సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త పథకం.....

Anganwadi Breakfast Scheme: తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌వాడీ చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారాన్ని మెరుగుపరచే దిశగా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ‘తొలి ముద్ద’(Tholi Mudda) పేరుతో ప్రత్యేక...
- Advertisement -
Chat on WhatsApp