TG 10th Results 2026: తెలంగాణలోని పదో తరగతి విద్యార్థులకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. పదో తరగతి ఫలితాల విడుదలపై విద్యార్థులు, తల్లిదండ్రుల నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. తెలంగాణ విద్యాశాఖ ప్రస్తుతం ఫలితాల విడుదలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు వేగంగా పూర్తి చేస్తోంది.
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 16తో ముగిశాయి. అనంతరం వెంటనే మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించిన అధికారులు, ఇప్పటికే మొదటి విడత జవాబు పత్రాల మూల్యాంకనాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.
తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మరియు గణితం సబ్జెక్టుల మూల్యాంకనం పూర్తికాగా, సైన్స్ మరియు సోషల్ సబ్జెక్టుల మూల్యాంకనం ఇంకా రెండు రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. అనంతరం స్కానింగ్ ప్రక్రియను ఏప్రిల్ 25లోపు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఫలితాల విడుదల ఎప్పుడు?
మూల్యాంకన ప్రక్రియ పూర్తైన తరువాత మార్కుల క్రోడీకరణ వేగంగా పూర్తి చేసి ఫలితాలను విడుదల చేయనున్నారు. అధికారుల అంచనా ప్రకారం 2026 పదో తరగతి ఫలితాలు మే మొదటి వారంలో విడుదల అయ్యే అవకాశం ఉంది. అందులోనూ మే 4 లేదా మే 5 తేదీల్లో ఫలితాలు విడుదల కావచ్చని విద్యాశాఖ వర్గాలు సూచిస్తున్నాయి.
విద్యార్థులకు ముఖ్య సూచన
ఫలితాల విడుదలకు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే నమ్మాలని అధికారులు సూచిస్తున్నారు. ఫేక్ లింక్స్ మరియు అపోహలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.








