Local Telangana Polls:ప్రజాపాలన వారోత్సవాలు  పూర్తయ్యాకనే ఎన్నికలు 

Telangana government postpones local elections due to BC reservation issues Telangana government postpones local elections due to BC reservation issues

తెలంగాణలో జూబ్లిహిల్స్ ఎన్నికల విజయాన్ని వెంటనే స్థానిక వెళ్ళాలి అనుకున్నా ప్రభుత్వం మరో నెల సమయం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వెనుక కారణం తమ ప్రభుత్వం ఏర్పడినందుకు నిర్వహించే ప్రజాపాలన సంబరాలు. డిసెంబర్ 1 నుంచి 9 రోజుల పాటు ఈ సంబరాలు జరపనున్నారు.

వాటి తరువాతే లోకల్ పోల్స్‌కు వెళ్లనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల పదవీ కాలం తెలంగాణలో చాల కాలం అయిపోయినప్పటికీ, బీసీ రిజర్వేషన్ల వివాదం కారణంగా ముందుకు అడుగు వేయలేకపోతున్నారు. 42% రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం జారీ చేసిన జివోలను హైకోర్టు, సుప్రీంకోర్టు స్టే చేసింది. 50% రిజర్వేషన్లతో మాత్రమే ఎన్నికలు జరగవచ్చని సూచించబడింది.

ALSO READ:iBomma Final Message: క్షమించండి iBomma ని శాశ్వతంగా మూసివేస్తున్నాం 

పార్టీ పరంగా రిజర్వేషన్లను అమలు చేసి ఎన్నికలు నిర్వహించడం రేవంత్ రెడ్డి ముందు ఉన్న ఒకే ఒక  మార్గం. గ్రామీణ స్థాయి క్యాడర్ అసంతృప్తితో ఉన్నందున, ప్రజాపాలన సంబరాలు మరియు పథకాలు పూర్తయ్యాకే స్థానిక ఎన్నికలు నిర్వహించబడే అవకాశం ఎక్కువగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *