Telangana government | భూముల రిజిస్ట్రేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Telangana government publishes prohibited lands list to prevent illegal registrations Telangana government publishes prohibited lands list to prevent illegal registrations

Telangana land registration: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ, అటవీ, దేవాదాయ భూముల అక్రమ క్రయ విక్రయాలను అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22(ఏ) కింద రూపొందించిన “నిషేధిత భూముల జాబితాను” ఈ ఏడాది డిసెంబర్ 3వ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు.

రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు జాబితాలను సిద్ధం చేశారు. ఆ జాబితాలో మొదట తప్పుడు వివరాలు ఉండటంతో సవరణలు చేసిన తర్వాత, “తుది జాబితాను పబ్లిక్ డొమైన్‌లో” ఉంచడానికి రిజిస్ట్రేషన్ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది.

ALSO READ:Sleepwell Agarbatti Toxic: దోమల కోసం వాడే స్లీప్‌వెల్ అగరబత్తీల్లో ప్రమాదకర రసాయనం  

ఈ చర్య ద్వారా భవిష్యత్తులో అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట పడనుంది. సాధారణ ప్రజలు ఈ జాబితాను పరిశీలించి, ఏ భూమి నిషేధితమో ముందుగానే తెలుసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో పారదర్శకత పెరుగుతూ, భూముల ఒప్పందాలు చట్టప్రకారం కుదిరేలా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *