Swayambhu: టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘స్వయంభు’(Swayambhu)ఒకటి.
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్(Nikhil Siddhartha) కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా కనిపించనుండగా, పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం “ఫిబ్రవరి 13, 2026న” ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రిలీజ్‌కు రెడీ అవుతోంది.
ALSO READ:Andhra Pradesh Launches Space City:ఆంధ్రప్రదేశ్‌లో స్పేస్ సిటీకి శ్రీకారం
పిరియాడికల్ మైథలాజికల్ డ్రామాగా రూపొందుతున్న ‘స్వయంభు’లో ఇంటర్వల్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఈ సన్నివేశంలో నిఖిల్‌తో పాటు ఇతర కీలక పాత్రల మధ్య జరిగే యాక్షన్ సన్నివేశాలు చాలా రా (Raw), వైల్డ్‌గా ఉండనున్నాయట. ముఖ్యంగా నిఖిల్ లుక్, యుద్ధ సన్నివేశాల సెటప్ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌కు తీసుకెళ్లేలా ఉంటుందని సమాచారం.
‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ విజువల్స్ ఈ యాక్షన్ సీక్వెన్స్‌కు మరింత బలాన్ని చేకూర్చనున్నాయట.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్‌తో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా, లేటెస్ట్ ఇంటర్వల్ యాక్షన్ అప్‌డేట్‌తో నిఖిల్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.
