Saturday, July 4, 2026
Chat on WhatsApp
HomeInterNationalతొమ్మిది నెలల తర్వాత భూమికి సునీతా సురక్షితంగా రాక

తొమ్మిది నెలల తర్వాత భూమికి సునీతా సురక్షితంగా రాక

-

Chat on WhatsApp

తొమ్మిది నెలల నిరీక్షణకు తెరపడింది. భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమిని సురక్షితంగా చేరుకున్నారు. ఆమెతో పాటు బుచ్ విల్మోర్, మరో ఇద్దరు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో బయలుదేరారు. ఈ తెల్లవారుజామున 3.27 గంటలకు వ్యోమనౌక ఫ్లోరిడా సముద్రతీరంలో విజయవంతంగా ల్యాండ్ అయింది.

భూమి వైపు గంటకు దాదాపు 27 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన క్యాప్సూల్ క్రమంగా వేగాన్ని తగ్గించుకుంది. 186 కిలోమీటర్ల వేగానికి చేరుకున్న తర్వాత దాని నాలుగు పారాచూట్లు తెరుచుకున్నాయి. ఆపై మరింత నెమ్మదిగా సముద్ర జలాల్లో ల్యాండ్ అయింది. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న నాసా బృందం, క్యాప్సూల్‌ను బోటుపైకి ఎక్కించి ఒడ్డుకు చేర్చింది.

అనంతరం వ్యోమగాములను బయటకు తీసి హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, భూమి గురుత్వాకర్షణానికి మళ్లీ అలవాటు పడే వరకు నిపుణుల పర్యవేక్షణలో ఉంచారు. ఐఎస్ఎస్ నుంచి వ్యోమనౌక విడిపోవడం మొదలు, భూమికి చేరే వరకు ఈ మొత్తం ప్రక్రియను నాసా ప్రత్యక్ష ప్రసారం చేసింది.

సునీతా విలియమ్స్ విజయవంతంగా భూమికి తిరిగి వచ్చారు. ఆమె ప్రయాణం అంతరిక్ష పరిశోధనలో మరో ముందడుగుగా నిలిచింది. ఈ విజయంతో భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలకు మరింత ప్రేరణ లభించనుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Indian Government | చిన్నారుల భద్రతపై కేంద్రం సీరియస్.. ఇన్‌స్టాగ్రామ్‌కు నోటీసులు జారీ

Indian Government: సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్‌కు కేంద్ర ప్రభుత్వం కీలక నోటీసులు జారీ చేసింది. చిన్నారుల భద్రతకు సంబంధించిన అంశాలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ...
- Advertisement -
Chat on WhatsApp