కడప జిల్లా జమ్మలమడుగు గంగమ్మ తల్లి ఆలయంలో వెండి కిరీటం చోరీ జమ్మలమడుగు పట్టణం కన్నెలూరు శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం అమ్మవారి వెండి కిరీటం చోరీ జరిగినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. వారు మాట్లాడుతూ ఇవాళ దసరా నవరాత్రులలో రెండవ రోజు కావడంతో ఆలయంలో తెల్లవారుజామున నుంచే పూజలు నిర్వహించామన్నారు అమ్మవారికి అలంకరణలో భాగంగా వెండి కిరీటం అలంకరించామన్నారు ఆ తర్వాత మధ్యాహ్నం వెండి కిరీటాన్ని దుండగులు చోరీ చేశారని తెలిపారు
జమ్మలమడుగు ఆలయంలో వెండి కిరీటం చోరీ
