Shamshabad IVF Tragedy: కవలలు, భార్యను కోల్పోయిన భర్త ఆత్మ*హ*త్య 

Shamshabad IVF tragedy couple and hospital emergency scene Scene depicting the Shamshabad IVF tragedy where a woman, her twin babies, and her husband died within hours.

Shamshabad IVF tragedy:శంషాబాద్‌లో  విషాదం భార్య, కవలలు(Twin Babies Death) కోల్పోయి భర్త,ఆ తరువాత తనుకూడా ఉరివేసుకొని చనిపోవడం శంషాబాద్లో విషాదాశయాలు కమ్ముకున్నాయి.ఐవీఎఫ్‌(IVF) చికిత్సపై ఆధారపడి ఎదురుచూస్తున్న దంపతుల జీవితాలు ఒక్కసారిగా విషాదంలో ముగిశాయి.

బెంగళూరుకు చెందిన ముత్యాల విజయ్ (40), భార్య శ్రావ్య (35) ఏడాదిన్నర క్రితం శంషాబాద్‌కు వెళ్లి అక్కడే జీవనం కొనసాగిస్తున్నారు. విజయ్‌ ఎయిర్‌పోర్టులో పనిచేస్తున్నాడు. ఐవీఎఫ్ చికిత్సతో శ్రావ్య ఎనిమిదో నెల గర్భంతో కవలలను మోస్తోంది. త్వరలోనే తల్లిదండ్రులుగా మారబోతున్నామనే ఆనందంతో దంపతులు కలలు కంటున్నారు.

ALSO READ:Telangana Gig Workers Act 2025: గిగ్ వర్కర్లకు చట్టబద్ధ భరోసా, కొత్త పాలసీ   

అయితే నవంబర్ 16 రాత్రి శ్రావ్యకు కడుపు నొప్పి రావడంతో అత్తాపూర్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు కవలలు గర్భంలోనే మరణించారని తెలిపారు.

ఈ దెబ్బతో శ్రావ్య స్పృహ తప్పగా, తరువాత గుడిమల్కాపూర్‌లోని మరో ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు నిలవలేదు. భార్యను, కవలలను కోల్పోయిన విజయ్ తీవ్ర మనస్తాపానికి గురై సోమవారం తెల్లవారుజామున ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఒకే కుటుంబంలో కొద్దిసేపు వ్యత్యాసంతో నాలుగు ప్రాణాలు కోల్పోవడంతో ప్రాంతం విషాదంలో మునిగిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *