Shah Rukh Khan King movie: ఈ క్రిస్మస్‌కు బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీ నెలకొననుంది. షారుక్ ఖాన్ నటిస్తున్న ‘కింగ్’తో పాటు, నాగార్జున కెరీర్‌లో 100వ సినిమాగా తెరకెక్కుతున్న ‘కింగ్ 100’ కూడా ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో డిసెంబర్ 24న బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీ నెలకొనే అవకాశముంది.
విడుదల తేదీపై షారుక్ స్పష్టత
షారుక్ ఖాన్ అభిమానుల్లో ‘కింగ్’ సినిమా విడుదలపై నెలకొన్న సందేహాలకు ఆయన తాజా సోషల్ మీడియా పోస్ట్‌తో స్పష్టత వచ్చింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 24న థియేటర్లలోకి రానుంది. సినిమాలోని పోస్టర్‌ను షేర్ చేసిన షారుక్.. “నేను హంతకుడిని కాదు.. ప్రేమికుడిని” అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ జోడించారు. దీంతో విడుదల వాయిదాపై వస్తున్న ప్రచారానికి తెరపడింది. ‘పఠాన్’ తర్వాత షారుక్, సిద్ధార్థ్ ఆనంద్ కలిసి పనిచేస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె, సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార వీడియో సినిమాపై అంచనాలను పెంచగా, తాజా అప్‌డేట్‌తో అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.
అదే తేదీన ‘కింగ్ 100’
ఇదిలా ఉంటే, అక్కినేని నాగార్జున కెరీర్‌లో మైలురాయిగా నిలవనున్న 100వ చిత్రం ‘కింగ్ 100’ కూడా డిసెంబర్ 24న థియేటర్లలోకి రానుంది. రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. ఒకే తేదీన షారుక్ ఖాన్, నాగార్జున చిత్రాలు విడుదల కానుండటంతో క్రిస్మస్ సీజన్‌లో బాక్సాఫీస్ సందడి మరింత పెరగనుంది. ఈ రెండు సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుందో తెలియాలంటే రిలీజ్ వరకు ఎదురుచూడాల్సిందే.
ALSO READ: AP Local Elections | చెప్పాం.. చేస్తున్నాం.. స్థానిక ఎన్నికల బరిలో కూటమి నినాదం
