విశాఖలో రెండో సారి ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమం డిసెంబర్ 29 న డాబాగార్డెన్స్ దగ్గర ఉన్న అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం కళావేదికలో నిర్వహిస్తున్నట్లు ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు పులగం రామచంద్రారెడ్డి తెలిపారు. డాబాగార్డెన్స్ ప్రెస్ క్లబ్ క్లబ్ లో మంగళ వారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. విశాఖలో డిసెంబర్ లో ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుందన్నారు. దేశ, విదేశాల నుంచి సినిమా ప్రముఖులు పాల్గొంటారని ,వెయ్యి సినిమాలు ప్రదర్శన జరుగుతుందన్నారు. పర్యాయకటక, సినిమా రంగం అభివృద్ధిలో భాగంగా సినీ రంగంలో 24 విభాగాలలో పనిచేస్తున్న కళాకారులకు ప్రోత్సాహం కోసం ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 8 ఫిల్మ్ ఫెస్టివల్స్ విజయవంతంగా నిర్వహించామన్నారు.
జాతీయ అధ్యక్షుడు హెచ్.ఆర్.దిలీప్ కుమార్ మాట్లాడుతూ విశాఖలో రెండో సారి ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించడం గర్వకారణం అన్నారు. ప్రముఖ నటులు, దర్శకులు, సినీ రంగం పెద్దలతో విజేతలకు బహుమతి ప్రదానం చేస్తామన్నారు.ఏపి “మా”అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ మాట్లాడుతూ ఆసియాలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ సినిమా హబ్ గా మారుతుందన్నారు. గత ఏడాది తొలిసారిగా ఫిల్మ్ ఫెస్టివల్ ని నిర్వహించినట్లు గుర్తు చేశారు. విశాఖలో రెండో సారి ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుందన్నారు. ఫిల్మ్ ఫెస్టివల్ లో రాఘవేంద్ర రావు, రాజమౌళి, సుకుమార్ వంటి ప్రముఖ దర్శకులు తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఈ ఫిలిం ఫెస్టివల్ ద్వారా విశాఖకు రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు వస్తుందన్నారు.
ఏపి మా అసోసియేషన్ కార్యదర్శి కుమార్ నాయక్ మాట్లాడుతూ విశాఖలో నిర్వహిస్తున్న ఫిలిం ఫెస్టివల్ కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత వుందన్నారు. సినిమా పరిశ్రమలో గల 24 క్రాఫ్ట్ నిష్ణాతులు ఎంపిక లక్ష్యంగా ఫిల్మ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశామని తెలిపారు. సంస్థ కు విజయవాడ సింగ్ నగర్లో కార్యాలయం వుందన్నారు. ఏపి ఉపాధ్యక్షుడు అనిల్ బాబు నెట్టి మాట్లాడుతూ ఈ ఫిల్మ్ ఫెస్టివల్ విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో జరుగుతుందన్నారు. కోసాధికారి ఆశా లత మాట్లాడుతూ ఫిల్మ్ ఫెస్టివల్ విశాఖలో ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఈ ఫెస్టివల్ కు విశాఖ ప్రజలందరూ హాజరై విజయవంతం చేయాలన్నారు. మీడియా సమావేశంలో జాతీయ జర్నలిస్టులు సంఘం కార్య దర్శి , సింహా చలం మాజీ ధర్మ కర్త గంట్ల శ్రీను బాబు మాట్లాడుతూ, ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రతిభ చూపిన సినీ రంగా కళాకారులందరికి అవార్డులు ప్రదానం చేస్తారన్నారు. సినిమా రంగంలో ప్రతిభకు ప్రోత్సాహంగా అవార్డులు అందజేస్తారన్నారు.