HomeTelanganaSchool Aadhaar update | ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేదు.. స్కూల్‌ల్లోనే ఉచిత అప్డేట్స్

School Aadhaar update | ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేదు.. స్కూల్‌ల్లోనే ఉచిత అప్డేట్స్

-

Chat on WhatsApp

School Aadhaar update: ప్రభుత్వ సేవలు పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి కావడంతో, చిన్న మార్పులకైనా ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పేరు నమోదు, క్యూ, గంటల తరబడి వేచి ఉండటం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో “తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు భారీ ఊరట ఇచ్చే నిర్ణయం తీసుకుంది.

ఇకపై ఆధార్ రిజిస్ట్రేషన్ లేదా అప్డేట్స్ కోసం విద్యార్థులు ప్రత్యేకంగా ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. “రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఆధార్ మొబైల్ క్యాంపులు(Telangana Aadhaar camps) నిర్వహించనున్నట్లు” పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. స్కూల్‌లోనే ఆధార్ అప్డేట్స్ పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉచిత ఆధార్ అప్డేట్ వివరాలు

5 నుంచి 15 ఏళ్ల వయసున్న విద్యార్థులకు “మొదటి బయోమెట్రిక్ అప్డేట్(Aadhaar biometric update) పూర్తిగా ఉచితం” రెండోసారి బయోమెట్రిక్ అప్డేట్ చేయాలంటే రూ.125 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఇప్పటికే ఉన్న ఆధార్ కార్డులో పేరు, చిరునామా వంటి వివరాలు మార్చాలంటే రూ.75 వర్తిస్తుంది. క్యాంపుల తేదీలు, పాఠశాల వివరాల కోసం జిల్లా, మండల స్థాయి విద్యాశాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు.

స్కూల్‌లోనే ఆధార్ అప్డేట్ అవకాశం రావడంతో పిల్లలు చదువు మానేసి బయట తిరగాల్సిన అవసరం లేకపోవడంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి.

కొత్త ఆధార్ యాప్‌తో మరింత సౌలభ్యం

ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం తాజాగా “కొత్త ఆధార్ యాప్‌ను లాంచ్ చేసింది”. ఈ యాప్ ద్వారా ఆధార్ వెరిఫికేషన్, మొబైల్ నంబర్, అడ్రస్ అప్డేట్ వంటి సేవలు సులభంగా పొందొచ్చు. అవసరమైన వివరాలు మాత్రమే షేర్ చేసే సదుపాయం ఉండటంతో పాటు, ఒకే యాప్‌లో ఐదుగురి వరకు ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. మొత్తంగా ఈ చర్యలు విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇబ్బందులు తగ్గించే దిశగా కీలకంగా మారాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Lionel Messi | మెస్సీ ఇంట తీవ్ర విషాదం.. తండ్రి జార్జ్ మెస్సీ కన్నుమూత

Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ తండ్రి, ఆయన కెరీర్‌కు బలమైన అండగా నిలిచిన జార్జ్ మెస్సీ (68)...
- Advertisement -
Chat on WhatsApp