Nirmala Sitharaman: భారత ఆర్థిక వ్యవస్థను నడిపే కేంద్ర ఆర్థిక మంత్రి “నిర్మలా సీతారామన్” దేశ చరిత్రలో మరో అరుదైన ఘనత సాధించారు. ” ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో Union Budget 2026-27 తో వరుసగా 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రి” గా నిర్మలమ్మ నిలిచారు. ఈ ఘనతకు మునుపు సార్లు ఎవరు చేరలేకపోయారు.
2019 మే 31న పదవీ బాధ్యతలు చేపట్టిన నిర్మలమ్మ, ఇప్పటి వరకు ఆరేళ్ల ఎనిమిది నెలల పాటు నిరంతరాయంగా ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో 7 సార్లు వార్షిక బడ్జెట్, 1 మధ్యంతర బడ్జెట్, ఇప్పుడు 9వసారి రాబోయే బడ్జెట్‌తో కలిపి ఆమె “వరుసగా 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు”.
గతంలో మొరార్జీ దేశాయ్ 10 సార్లు, పి. చిదంబరం 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినా, వారు వేర్వేరు ప్రధానుల కింద, మధ్యలో విరామాలు ఇచ్చి మాత్రమే ఉన్నారు. నిర్మలమ్మ ఈ రికార్డును నిలుపుతూ భారత పార్లమెంటరీ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆమె ఘనతను కొనియాడారు.
also read:Tecno Pova Curve 2 | Android 16తో Tecno Pova Curve 2.. మిడ్‌రేంజ్‌లో గట్టి పోటీ
