ఒకే కుటుంబంలో 18 మందిచనిపోవడం కలకలం రేపుతోంది.సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం హైదరాబాద్(Saudi Bus Accident) రాంనగర్ లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో రాంనగర్‌కు చెందిన నసీరుద్దీన్ కుటుంబంలోని 18 మంది మరణించారు.
ఉమ్రా యాత్రకు కుటుంబ సభ్యులందరినీ తీసుకుని సౌదీకి వెళ్లిన నసీరుద్దీన్‌తో పాటు అతని సన్నిహితులు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా హైదరాబాద్ వాసులే కావడంతో ప్రాంతమంతా శోకసంద్రంగా మారింది.
ALSO READ:iBomma Final Message: క్షమించండి iBomma ని శాశ్వతంగా మూసివేస్తున్నాం
దుర్ఘటన జరిగిన విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ కుటుంబంలో ఇప్పుడు ఒక్కరే మిగిలారని సమాచారం. నసీరుద్దీన్ కుమారుడు సిరాజుద్దీన్ ఉద్యోగ రీత్యా అమెరికాలో ఉంటున్నాడు. అతడే ప్రస్తుతం ఆ కుటుంబానికి ఏకైక సభ్యుడిగా మిగిలిపోయాడని వారి బంధువులు వెల్లడించారు.
సౌదీ అధికారులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. మృతదేహాలను హైదరాబాద్‌కు తరలించే ప్రక్రియ ప్రారంభమైనట్లు సమాచారం. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది.
