Tuesday, July 14, 2026
Chat on WhatsApp
HomeNationalRatna Debnath | నా జీవితాన్ని ప్రజలకు అంకితం చేస్తున్నా’.. రత్నా దేబ్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు

Ratna Debnath | నా జీవితాన్ని ప్రజలకు అంకితం చేస్తున్నా’.. రత్నా దేబ్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు

-

Chat on WhatsApp

Ratna Debnath: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆర్జీ కార్ ఘటన బాధితురాలి, పీజీ విద్యార్థిని తల్లి, ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన రత్నా దేబ్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో పీజీ విద్యార్థిని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఆ విద్యార్థిని తల్లి రత్నా దేబ్‌నాథ్ తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాణిహట్టి నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున విజయం సాధించారు.

తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. రాష్ట్ర సచివాలయంలో సీఎం సువేందు అధికారిని కలిసిన అనంతరం ఎక్స్ ఖాతాలో స్పందించిన రత్నా దేబ్‌నాథ్.. “నాకు నా కూతుర్ని కోల్పోయిన బాధ ఉంది. ఇప్పుడు మమతా బెనర్జీ తన సీఎం కుర్చీని కోల్పోయింది” అని వ్యాఖ్యానించారు.

అన్యాయంపై పోరాటానికి సహనం అవసరమని పేర్కొన్న ఆమె.. ఇకపై తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేస్తానన్నారు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ నేతలు రాబోయే రోజుల్లో మరిన్ని సవాళ్లు ఎదుర్కొంటారని కూడా వ్యాఖ్యానించారు. రత్నా దేబ్‌నాథ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp