Army Security:పాకిస్థాన్‌లో పర్యటిస్తున్న శ్రీలంక క్రికెట్ జట్టుకు ఉగ్రదాడుల భయంతో భద్రతను గణనీయంగా పెంచారు(Pak Sri Lanka Cricket Security). దేశంలో ఇటీవల వరుసగా జరిగిన ఉగ్రవాద దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.
ఆటగాళ్ల భద్రత కోసం పాక్ ఆర్మీ, పారామిలటరీ రేంజర్లు నియమించబడ్డారు. పీసీబీ ఛైర్మన్ మరియు దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ స్వయంగా శ్రీలంక(SRI LANKA) జట్టును కలసి “మీ భద్రత మా బాధ్యత. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం” అని హామీ ఇచ్చారు.
ALSO READ:Telangana Jagruti:మా పార్టీతో పెట్టుకున్నవారు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు
ఇటీవల ఇస్లామాబాద్‌లో జ్యుడీషియల్ కాంప్లెక్స్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది మృతి చెందగా, వానా ప్రాంతంలోని కేడెట్ కాలేజీపై దాడి యత్నం భద్రతా దళాలు అడ్డుకున్నాయి.
ఈ ఘటనల తర్వాత పాక్ ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేసింది.
గమనించదగిన విషయం ఏమిటంటే, 2009లో లాహోర్‌లో శ్రీలంక జట్టు బస్సుపై టీటీపీ ఉగ్రదాడి జరిగింది. దాంతో దశాబ్దం పాటు పాక్‌లో అంతర్జాతీయ క్రికెట్ నిలిచిపోయింది.
ఇప్పుడు మళ్లీ అంతర్జాతీయ జట్లు రావడం ప్రారంభమైన నేపథ్యంలో ఏ ప్రమాదం జరగకుండా పీసీబీ అప్రమత్తంగా ఉంది. శ్రీలంక జట్టు ప్రస్తుతం రావల్పిండిలో మూడు వన్డేలు ఆడనుంది.
