యంగ్ టైగర్ ఎన్టీఆర్, యాక్షన్ స్పెషలిస్ట్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ సినిమా నుండి తాజా అప్‌డేట్ వచ్చింది. మేకర్స్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ నెల 22వ తేదీ నుంచి తారక్ షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పట్ల ఫ్యాన్స్‌లో భారీ క్రేజ్ నెలకొని ఉంది.
ప్రస్తుతం కొన్ని ముఖ్యమైన సన్నివేశాల షూటింగ్ కొనసాగుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ విభిన్న పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతానికి “డ్రాగన్” అనే టైటిల్ పరిశీలనలో ఉన్నప్పటికీ, ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. ఈ మూవీకి సంబంధించి మేకర్స్ అన్ని అప్‌డేట్స్‌ను జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు.
ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బడ్జెట్ పరంగా భారీగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనుంది. రవి బస్రూర్ సంగీతం అందించనుండగా, టెక్నికల్ టీమ్ కూడా టాప్ క్లాస్ గానే ఉండనుంది.
ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానుల్లోనే కాకుండా, సినీ ప్రియుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్ లుక్, కథ, నేపథ్యం గురించి చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఎన్టీఆర్ చేసిన సినిమాల్లో ఇది డిఫరెంట్ ట్రాక్‌లో సాగే ప్రాజెక్టుగా మేకర్స్ చెబుతున్నారు.