NDA Bihar Election Results | చంద్రబాబు అభినందనలు

Chandrababu Naidu reacts to NDA’s historic victory in Bihar elections Chandrababu Naidu reacts to NDA’s historic victory in Bihar elections

NDA Bihar Election Results:బీహార్‌లో ఎన్డీయే కూటమి భారీ, చారిత్రక విజయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో పాటు బీజేపీ, జనతాదళ్ (యునైటెడ్) తరఫున గెలుపొందిన మరియు ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులందరికీ ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన”వికసిత భారత్”(Vikasith Bharat) దార్శనికతకు, ఎన్డీయే(NDA) ప్రగతిశీల పాలనకు ప్రజలు మరోసారి బలమైన మద్దతు ప్రకటించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సందేశంలో, “బీహార్‌లో ఎన్డీయే సాధించిన అద్భుత విజయం ప్రజల విశ్వాసానికి ప్రతీక.

ALSO READ:Jubilee Hills by-election results | జూబ్లీహిల్స్ ఫలితాలపై కేసీఆర్ స్పందన

ఇది ప్రధాని మోదీ నాయకత్వం మరియు ఎన్డీయే పాలనపై ఉన్న నమ్మకాన్ని మరింత బలపరుస్తోంది” అని అన్నారు. తన మిత్రుడు నితీశ్ కుమార్‌కు, బీజేపీ–జేడీయూ విజేతలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

చంద్రబాబు #NaNiLandslideInBihar హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించడం ప్రత్యేకం. నరేంద్ర మోదీ–నితీశ్ పేర్ల కలయికగా రూపుదిద్దుకున్న ‘NaNi’ పదం ఇరువురు నేతల మధ్య స్నేహాన్ని సూచిస్తోంది.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు కొనసాగుతున్న సమయంలో ఎన్డీయేపై వస్తున్న ఆధిక్యం జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *