Mulugu Illegal Affair:ములుగు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది లాలాయగూడెం గ్రామానికి చెందిన ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో కుటుంబ సభ్యులు, ఎటునాగారం మండల కేంద్రానికి చెందిన బైక్ మెకానిక్ జాడి సమ్మయ్యను సిమెంట్ పోలుకు కట్టేసి అతి దారుణంగా చితకబాదినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో సమ్మయ్య అక్కడికక్కడే మృతిచెందాడు.
సమ్మయ్య ఎటునాగారంలో బైక్ మెకానిక్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ALSO READ:Hyderabad CP Sajjanar:సీపీ సజ్జనార్‌తో సినీ ప్రముఖుల భేటీ
అక్రమ సంబంధ అనుమానాలు, కుటుంబ కలహాలు ఇటీవలి కాలంలో పెరుగుతున్న నేపథ్యంలో ఈ సంఘటన కలకలం రేపుతోంది. నిందితులను అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
