HomeInterNationalLufthansa Flights | లుఫ్తాన్సా భారీ నిర్ణయం.. 20 వేల విమానాల రద్దు, ఎందుకంటే ?

Lufthansa Flights | లుఫ్తాన్సా భారీ నిర్ణయం.. 20 వేల విమానాల రద్దు, ఎందుకంటే ?

-

Chat on WhatsApp

Lufthansa Flights: యూరప్‌లో అతిపెద్ద విమానయాన సంస్థలలో ఒకటైన Deutsche Lufthansa AG కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న జెట్ ఇంధన ధరల ప్రభావంతో ఈ సమ్మర్ సీజన్‌లో భారీగా విమానాలను రద్దు చేయనున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా యూరోప్ లో షార్ట్ హాల్ ప్రయాణాలపై ప్రభావం పడనుంది.

ఇరాన్ యుద్ధ పరిస్థితుల తర్వాత జెట్ ఇంధన ధరలు గణనీయంగా పెరగడంతో, లుఫ్తాన్సా సుమారు 20 వేల విమానాలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల మొత్తం సీటింగ్ సామర్థ్యం దాదాపు 1 శాతం తగ్గే అవకాశం ఉంది. అయితే దీని ద్వారా సుమారు 40 వేల టన్నుల ఇంధనం ఆదా అవుతుందని సంస్థ అంచనా వేస్తోంది.

మొదటి దశలో రద్దులు ప్రారంభం

మొదటి దశలోనే సుమారు 120 విమానాలను రద్దు చేసినట్లు లుఫ్తాన్సా వెల్లడించింది. ఈ రద్దులు మే నెల చివరి వరకు కొనసాగనున్నాయి. అలాగే సమ్మర్ షెడ్యూల్‌లో మరిన్ని మార్పులు ఏప్రిల్ చివర లేదా మే ప్రారంభంలో ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

ఇంధన ధరల ప్రభావం

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం విమానయాన రంగంపై తీవ్రంగా పడుతోంది.ఇరాన్ ప్రాంతంలో యుద్ధ ఉద్రిక్తతల కారణంగా జెట్ ఫ్యూయల్ ధరలు పెరగడంతో, అనేక ఎయిర్‌లైన్స్ తమ సేవలను తగ్గిస్తున్నాయి. మే నెలలో గ్లోబల్ ఎయిర్‌లైన్ సామర్థ్యం సుమారు 3 శాతం తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఖర్చు తగ్గించే చర్యలు

లుఫ్తాన్సా ఇప్పటికే తన ప్రాంతీయ యూనిట్‌ను మూసివేయడం, పాత విమానాలను నిలిపివేయడం వంటి చర్యలు తీసుకుంది. భవిష్యత్తులో ఖర్చులను తగ్గించేందుకు 2030 నాటికి సుమారు 4 వేల పరిపాలనా ఉద్యోగాలను తగ్గించే యోచనలో ఉంది.

అదేవిధంగా తక్కువ ఖర్చుతో నడిచే యూనిట్లు అయిన City Airlines, Discover Airlines లకు షార్ట్ హాల్ విమానాలను మార్చే ప్రణాళికలో ఉంది. ఈ యూనిట్లలో సిబ్బంది ఖర్చులు ప్రధాన సంస్థతో పోలిస్తే 40 శాతం వరకు తక్కువగా ఉంటాయి.

విమానయాన రంగంపై ప్రభావం

లుఫ్తాన్సా తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ విమానయాన రంగంలో పెద్ద మార్పులకు దారితీయొచ్చు. పెరుగుతున్న ఇంధన ధరలు, ఆపరేషనల్ ఖర్చులు కారణంగా భవిష్యత్తులో మరిన్ని ఎయిర్‌లైన్స్ కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Lionel Messi | మెస్సీ ఇంట తీవ్ర విషాదం.. తండ్రి జార్జ్ మెస్సీ కన్నుమూత

Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ తండ్రి, ఆయన కెరీర్‌కు బలమైన అండగా నిలిచిన జార్జ్ మెస్సీ (68)...
- Advertisement -
Chat on WhatsApp