Saturday, March 7, 2026
No menu items!
Google search engine
HomeBusinessLPG gas cylinder | పశ్చిమాసియా యుద్ధ ప్రభావం.. దేశంలో మళ్లీ పెరిగిన వంటగ్యాస్ ధరలు

LPG gas cylinder | పశ్చిమాసియా యుద్ధ ప్రభావం.. దేశంలో మళ్లీ పెరిగిన వంటగ్యాస్ ధరలు

- Advertisement -
Google search engine

LPG gas cylinder: దేశంలో వంట గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. చమురు సంస్థలు గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.60, వాణిజ్య సిలిండర్‌పై రూ.115 పెంపును ప్రకటించాయి. అర్ధరాత్రి నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. దీంతో హైదరాబాద్‌లో గృహ వినియోగ సిలిండర్ ధర రూ.965కు చేరింది.

అయితే ఉజ్వల పథకం కింద అందించే సబ్సిడీ సిలిండర్ల ధరల్లో మార్పు లేదని చమురు సంస్థలు తెలిపాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని సమాచారం.

ప్రధాన నగరాల్లో కొత్త ఎల్‌పీజీ ధరలు

14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరలు ఇలా ఉన్నాయి: ఢిల్లీ రూ.913, ముంబయి రూ.912.50, కోల్‌కతా రూ.939, చెన్నై రూ.928.50.
19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరలు ఢిల్లీలో రూ.1883, ముంబయిలో రూ.1835, కోల్‌కతాలో రూ.1990, చెన్నైలో రూ.2043గా ఉన్నాయి.

పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో ఇంధన సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందిస్తూ దేశంలో ఎలాంటి ఇంధన కొరత లేదని తెలిపారు.

అలాగే ఇండియన్ అయిల్ కార్పొరేషన్ (Indian Oil Corporation) కూడా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న కొరత వార్తలను ఖండించింది.

YouTube thumbnailYouTube icon
- Advertisement -
Google search engine
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular