Friday, February 20, 2026
spot_img
HomeTGHyderabadLB NAGAR చట్నీస్‌ హోటల్‌లో పేలుడు – ముగ్గురుకి తీవ్ర గాయాలు

LB NAGAR చట్నీస్‌ హోటల్‌లో పేలుడు – ముగ్గురుకి తీవ్ర గాయాలు

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ ప్రాంతంలో ఉన్న చట్నీస్‌(Chutneys) హోటల్‌లో పేలుడు సంభవించింది. ఇడ్లీ స్టీమర్‌లో ఒక్కసారిగా పేలుడు చోటుచేసుకోవడంతో హోటల్‌లో ఉన్న వినియోగదారులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. పేలుడు కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా స్టీమర్‌లో ఒత్తిడి పెరగడం వల్లే ఈ ఘటన జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

READ MORE:Donald Trump Aliens | ఏలియన్స్ సమాచారం విడుదల చేస్తాం:డోనాల్డ్ ట్రంప్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular