కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త త్వరలో ప్రారంభం కానున్న రైల్వే స్టేషన్

Komuravelli Mallanna railway station construction nearing completion Komuravelli Mallanna railway station construction nearing completion

Komuravelli Mallanna Railway Station:సిద్దిపేట జిల్లా- కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో భక్తులు ఎప్పటి నుంచో కోరుతున్న కొత్త రైల్వే స్టేషన్(Railway Station) పనులు చివరి దశకు చేరుకున్నాయి. అతిత్వరలో ఈ స్టేషన్ ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. 

ALSO READ:Maharashtra Road Accident | డ్రైవర్‌కు గుండెపోటుతో అదుపుతప్పిన కారు.. ఐదురుగురి విషాద మృతి  

మొత్తం నిర్మాణంలో 96% పనులు పూర్తికావడం వల్ల స్టేషన్ త్వరలోనే ప్రజల వినియోగానికి సిద్ధం కానుంది. కొమురవెల్లి మల్లన్న(Komuravelli Mallanna) సన్నిధిని దర్శించేందుకు హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల నుంచి ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు వస్తుంటారు.

కొత్త స్టేషన్ ప్రారంభమైతే భక్తుల ప్రయాణ కష్టాలు గణనీయంగా తగ్గుతాయని అధికారులు తెలిపారు. ఆధునిక మౌలిక వసతులు, ప్రయాణికుల సౌకర్యాల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ స్టేషన్ ప్రాంతీయ రవాణా అభివృద్ధికి దోహదం చేయనుంది.

రైల్వే లైన్ విస్తరణ, ప్లాట్‌ఫారమ్ నిర్మాణం, ఎలక్ట్రికల్ పనులు, టికెట్ కౌంటర్లు, వేటింగ్ హాల్స్ వంటి ముఖ్యమైన విభాగాలు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగిలిన చిన్నపాటి పనులు ముగిసిన వెంటనే అధికారిక ప్రారంభ తేది ప్రకటించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *