Kokapet Land Auction: ఎకరానికి 137 కోట్లు – మధ్యతరగతికి ఇల్లు దూరం..?

Kokapet land auction pushes Hyderabad real estate prices to record highs Kokapet land auction pushes Hyderabad real estate prices to record highs

Kokapet land auction: హైదరాబాద్‌లోని కోకాపేట భూవేలం మరోసారి రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై తీవ్ర చర్చకు దారితీసింది. తాజాగా ఎకరానికి రూ.137 కోట్లకు పైగా ధర పలకడంతో వజ్ర, ఎంఎస్ఎన్ రియాల్టీ వంటి కంపెనీలు పది ఎకరాలకు దాదాపు రూ.1300 కోట్లు వెచ్చించాయి.

ఈ వేళలను చాలామంది రియల్ ఎస్టేట్ బూమ్‌గా అభిప్రాయపడుతున్నా, విశ్లేషకులదృష్టిలో ఇది మార్కెట్‌కు భవిష్యత్తులో సమస్యలు తెచ్చే సంకేతంగా కనిపిస్తోంది.

also read:Chaganti | నైతిక విలువలతో భావితర నిర్మాణం: ఏపీ విద్యలో చాగంటి దిశానిర్దేశం 

పెరుగుతున్న భూముల ధరల వల్ల ఇప్పటికే సాధారణ కుటుంబాలకు ఇల్లు కొనడం దూరమవుతోంది. హైదరాబాద్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ కూడా 70 లక్షల కంటే తక్కువకు దొరకని పరిస్థితి. ఆధునిక సౌకర్యాలు ఉన్న అపార్టుమెంట్ల ధరలు కోటి దాటడం సాధారణమైంది.

ఇక అధిక రేట్లకు భూమి కొనుగోలు చేసిన బిల్డర్లు భారీ గగనచుంధ్రాలు నిర్మించి, కనీసం రెండున్నర కోట్లకు పైగా అమ్మకానికి పెట్టే అవకాశం ఉంది. కానీ ఆ ధరలకు కొనుగోలుదారుల సంఖ్య పరిమితంగానే ఉండటం మార్కెట్ స్థిరత్వాన్ని ప్రశ్నిస్తోంది.

కోకాపేట వేలాలు ఇతర ప్రాంతాల్లో కూడా భూముల రేట్లను పెంచుతున్నాయి. అఫోర్డబుల్ హౌసింగ్ తగ్గిపోవడానికి భూముల అతి భారీ ధరలే కారణమని బిల్డర్లు చెబుతున్నారు.

ఈ రీతిలో ప్రభుత్వ వేలాలు రేట్లను మరింతగా పెంచితే, మధ్యతరగతి కుటుంబాలకు ఇల్లు కొనుగోలు లక్ష్యం మరింత దూరమవుతుంది. దీర్ఘకాలంలో ఇది రియల్ ఎస్టేట్ మార్కెట్‌కే సవాళ్లను తెచ్చే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *