కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల కేసులో తెలంగాణ హైకోర్టు(HIGH COURT) కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(kcr)పై చర్యలు తీసుకోవద్దని గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు మరోసారి పొడిగించింది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం, వచ్చే ఏడాది జనవరి 19 వరకు కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రివర్యులు హరీశ్ రావు, మాజీ సీఎస్ ఎస్‌కే జోషి, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌పై కూడా ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది.
కాళేశ్వరం(Kaleshwaram project) ప్రాజెక్టులో అవకతవకలు చోటుచేసుకున్నాయని పీసీ ఘోష్ నివేదికలో పేర్కొనడంతో, ప్రభుత్వం విచారణకు సిద్ధమైంది. అయితే, కేసీఆర్ తదితరులు హైకోర్టును ఆశ్రయించడంతో గతంలో వారికి తాత్కాలిక రక్షణ లభించింది.
తాజాగా ఈ రక్షణ గడువును కోర్టు పొడిగించింది.ప్రభుత్వం తరఫున న్యాయవాదికి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి నాలుగు వారాల సమయం ఇచ్చింది.
తదుపరి విచారణను జనవరి 19కి వాయిదా వేసిన హైకోర్టు, అప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోరాదని మరోసారి స్పష్టం చేసింది.
