రామగుండం బీజేపీ అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థి అంజిరెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి కొమురయ్యకు మద్దతుగా కందుల సంధ్యారాణి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటమి పాలవుతుందని వ్యాఖ్యానించారు.
కందుల సంధ్యారాణి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ముఖ్యంగా ప్రైవేట్, ప్రభుత్వ రంగంలోని ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గత ఏడాది కాలంగా ప్రభుత్వ టీచర్లకు ఎటువంటి ప్రయోజనం కల్పించలేదని, 317 G.O ద్వారా ఉపాధ్యాయుల సమస్యలు మరింత పెరిగాయన్నారు.
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్యను పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని, బీజేపీ నాయకత్వంలో సమస్యల పరిష్కారానికి బలమైన గొంతుక కావాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి, వారికి న్యాయం చేసేలా కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు తిరుగు హనుమంత్ గౌడ్, అసెంబ్లీ గ్రాడ్యుయేట్ కన్వీనర్ భూమయ్య, విశ్వాస్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రచారంలో పెద్ద సంఖ్యలో పట్టభద్రులు హాజరై బీజేపీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు.