జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ మధ్య విషాదం చోటుచేసుకుంది. ఫలితాలు వెలువడే వేళ ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థి మహమ్మద్ అన్వర్ (40) హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. ఎర్రగడ్డలో నివసిస్తున్న అన్వర్ ఉదయం నుంచి యూసఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఓట్ల లెక్కింపును ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు.
ఈ సమయంలో ఆయనకు అకస్మాత్తుగా ఛాతీ నొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ, వైద్యులు ఆయనను మృతిగా ప్రకటించారు. కౌంటింగ్ టెన్షన్, ఫలితాలపై మానసిక ఒత్తిడి కారణంగా గుండెపోటు వచ్చి ఉండవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది.
అన్వర్ ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర షాక్‌కు గురయ్యారు.
ALSO READ:NDA crosses majority mark in Bihar | బిహార్ 243 స్థానాల్లో ఎన్నుకున్న మెగాలీడ్
ఇదిలాఉంటే, యూసఫ్‌గూడ స్టేడియంలో భద్రతా కట్టుదిట్టం మధ్య 10 రౌండ్లుగా, 42 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రతి టేబుల్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పారదర్శకతను పాటిస్తున్నారు. మొత్తం 186 మంది సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు.
