బాలీవుడ్ స్టార్ దర్శకుడు కరణ్ జోహార్ ఓ ఆసక్తికర ఇన్‌స్టా స్టోరీ పెట్టాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ త్వరలో రొమాంటిక్ పాత్రలో కనిపించబోతున్నారని వెల్లడించాడు. ఈ పోస్ట్‌తో అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది. బాలీవుడ్‌లో తలా తెరంగేట్రం చేస్తున్నారా? అని నెట్టింట చర్చలు ఊపందుకున్నాయి.
ఇన్‌స్టా స్టోరీలో కరణ్ జోహార్ పెట్టిన వీడియోలో ధోనీ చేతిలో లవ్ సింబల్ బెలూన్ ఉంది. క్యూట్‌గా చిరునవ్వుతో కనిపించిన ధోనీను చూస్తే ఓ సినిమా ప్రాజెక్ట్‌లో నటిస్తున్నట్టు అనిపిస్తోంది. దీంతో బాలీవుడ్‌లో ఆయన డెబ్యూ ఖాయం అనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఈ వార్తపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలగా స్పందిస్తున్నారు. “ధోనీ రొమాన్స్ చేస్తే చూస్తామా!” అని కొందరు కామెంట్ చేస్తే, మరికొంత మంది “కరణ్ నిర్మాతగా ఎంట్రీ ఇస్తే మ్యాజిక్ ఖాయం” అంటున్నారు. అయితే ఇది సినిమా కాదని, యాడ్ షూటింగ్ మాత్రమే కావచ్చని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ తర్వాత వ్యాపార రంగంలో, నిర్మాతగా, ఐపీఎల్ జట్టుతో కొనసాగుతున్నాడు. ఇప్పుడు రొమాంటిక్ పాత్రలో కనిపిస్తే అది అభిమానులకు పండుగే అవుతుంది. ఇది యాడ్ అయినా సరే, కరణ్ జోహార్ ప్రొమోషన్ స్టైల్ వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి మోతాదుగా పెరిగింది.