Indian Stock Markets: మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్ పై యునైటెడ్, ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో యుద్ధ భయం పెరిగింది. ఈ పరిణామాలు భారతీయ స్టాక్ మార్కెట్లను తీవ్రంగా కుదిపేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, ముడి చమురు ధరల పెరుగుదలతో సూచీలు భారీగా క్షీణించాయి.
ట్రేడింగ్‌లో BSE Sensex 1,048 పాయింట్లు పడిపోయి 80,238 వద్దకు చేరగా, Nifty 50 307 పాయింట్లు నష్టపోయి 24,871 స్థాయిలో కొనసాగింది.
ప్రీ-ఓపెన్ సెషన్‌లోనే సెన్సెక్స్ దాదాపు 2,700 పాయింట్లు క్షీణించడం పెట్టుబడిదారుల్లో ఆందోళన పెంచింది. రూపాయి విలువ కూడా 24 పైసలు తగ్గి 91.32 వద్ద ట్రేడ్ అయింది.
ఇదిలా ఉంటే చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ను ఇరాన్ మూసివేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం ఈ మార్గం ద్వారా జరుగుతుంది.
భారత్ దిగుమతి చేసుకునే చమురులో సగం ఈ మార్గంపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుతం బ్యారెల్ ధర 70–73 డాలర్ల వద్ద ఉన్నా, యుద్ధం ముదిరితే 90–100 డాలర్లకు చేరొచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.









