Wednesday, July 15, 2026
Chat on WhatsApp
HomeSportsFIFA World Cup | FIFA మ్యాచ్‌లను అక్రమంగా ప్రసారం చేసిన వెబ్‌సైట్లపై అమెరికా ఉక్కుపాదం

FIFA World Cup | FIFA మ్యాచ్‌లను అక్రమంగా ప్రసారం చేసిన వెబ్‌సైట్లపై అమెరికా ఉక్కుపాదం

-

Chat on WhatsApp

FIFA World Cup: ఫిఫా వరల్డ్‌కప్ మ్యాచ్‌లను అక్రమంగా ప్రసారం చేస్తున్న వెబ్‌సైట్లపై అమెరికా ప్రభుత్వం భారీ స్థాయిలో చర్యలు చేపట్టింది. కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘిస్తూ అనుమతి లేకుండా మ్యాచ్‌లను లైవ్ స్ట్రీమ్ చేస్తున్న సుమారు 400 వెబ్‌సైట్లను గుర్తించి వాటి డొమెయిన్లను స్వాధీనం చేసుకున్నట్లు అమెరికా న్యాయశాఖ వెల్లడించింది. ఈ ఆపరేషన్‌లో ఫిఫా, అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలు, ప్రసార హక్కులు కలిగిన మీడియా సంస్థలు కూడా కీలక పాత్ర పోషించాయి.

దర్యాప్తు సందర్భంగా అనధికారిక స్ట్రీమింగ్ ద్వారా కోట్లాది డాలర్ల ఆదాయానికి నష్టం కలిగించే విధంగా ఈ వెబ్‌సైట్లు పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కోర్టు ఆదేశాల మేరకు కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించిన డొమెయిన్లను సీజ్ చేసినట్లు న్యాయశాఖ తెలిపింది. ఈ ఆపరేషన్‌లో ఇంటర్నేషనల్ కంప్యూటర్ హ్యాకింగ్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ నెట్‌వర్క్‌కు చెందిన ప్రత్యేక శిక్షణ పొందిన అధికారులు పలు దేశాల్లో సాంకేతిక దర్యాప్తు నిర్వహించారు. అక్రమ స్ట్రీమింగ్‌కు ఉపయోగించిన సర్వర్లు, డొమెయిన్లను గుర్తించి వాటి కార్యకలాపాలను నిలిపివేశారు.

పెరూ, బల్గేరియా దేశాల్లో ప్రధాన సర్వర్లు ఉన్నట్లు గుర్తించగా, క్రొయేషియా, రొమేనియా, పోలాండ్, కొలంబియా దేశాల్లో కూడా ఈ నెట్‌వర్క్‌కు సంబంధించిన డిజిటల్ మౌలిక సదుపాయాలను అధికారులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ పైరసీని అరికట్టేందుకు ఇలాంటి చర్యలు కొనసాగుతాయని అమెరికా న్యాయశాఖ స్పష్టం చేసింది. క్రీడా ప్రసార హక్కులను రక్షించేందుకు అంతర్జాతీయ సంస్థల మధ్య సమన్వయం మరింత బలోపేతం కానుందని అధికారులు వెల్లడించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp