బుమ్రా గర్జన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్(India vs South Africa 1st Test)లో భారత బౌలర్లు అద్భుతమైన ఆరంభం అందించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా జట్టు కేవలం 16 ఓవర్లలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది.
ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే జస్‌ప్రీత్ బుమ్రా దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను తాట తీస్తున్నాడు. మొదట బుమ్రా బౌలింగ్‌లో ర్యాన్ రికెల్టన్ 23 పరుగుల వద్ద బౌల్డ్ అయ్యాడు.
కొద్ది సమయంలోనే ఐడెన్ మార్క్రమ్ కూడా 31 పరుగుల దగ్గర రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో సఫారీలు 62/2గా కష్టాల్లో పడ్డారు.
ALSO READ:CII Summit Visakhapatnam | విశాఖలో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
దీంతో భారత బౌలర్ల ఆధిపత్యం మరింత పెరిగింది. తర్వాత కుల్‌దీప్ యాదవ్ స్పిన్ మాయలో కెప్టెన్ టెంబా బవుమా 3 పరుగుల వద్ద ధ్రువ్ జురేల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
71 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా జట్టు 18 ఓవర్లకు 82/3తో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ప్రారంభం నుంచే భారత బౌలర్లు మ్యాచ్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు స్పష్టమవుతోంది.
