Hong Kong skyscraper fire incident: అగ్నిప్రమాదాలు కాంక్రీట్ జంగిల్స్‌లో జరగవని అనుకునే అభిప్రాయం తాజాగా మారిపోయింది. హాంకాంగ్‌లోని ఓ కమ్యూనిటీలో ఎనిమిది స్కై స్క్రాపర్ అపార్టుమెంట్లు ఉండగా, ఒక్క ఫ్లాట్‌లో ప్రారంభమైన మంటలు క్షణాల్లోనే ఇతర టవర్లకు వ్యాపించి భారీ నష్టం కలిగించాయి.
ప్రాణనష్టం ఎంత జరిగిందన్నది ఇంకా పూర్తిగా వెల్లడికాలేదు. ఈ దృశ్యాలు ఆకాశహర్మ్యాల్లో నివసించే ప్రజల్లో భయాన్ని పెంచుతున్నాయి. హైదరాబాద్‌లో ఇటీవలి కాలంలో హై-రైజ్ నిర్మాణాల ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. 30 అంతస్తుల భవనాలు సాధారణం కాగా, 50 నుండి 60 అంతస్తుల టవర్లు కూడా కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి.
ALSO READ:Parakamani Case | వైవీ సుబ్బారెడ్డి సీఐడీ విచారణకు హాజరు
అయితే ఇలాంటి నిర్మాణాల్లో అగ్నిప్రమాదాలు సంభవిస్తే దాని ప్రభావం విస్తృతంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్క అంతస్తులో మంటలు వ్యాపిస్తే, సమయానికి నియంత్రించకపోతే మొత్తం కమ్యూనిటీ ప్రమాదంలో పడే అవకాశం ఉందని సూచిస్తున్నారు.
హాంకాంగ్‌లో అగ్నిప్రమాదం తీవ్రత పెరగడానికి కారణం భవనం చుట్టూ మరమ్మతుల కోసం ఏర్పాటు చేసిన వెదురుకర్రల దడి. అవి మంటలకు గురికావడంతో మొత్తం నిర్మాణానికి నిప్పు వ్యాపించింది.
హైదరాబాద్‌లో కూడా కొన్నాళ్ల క్రితం నల్లగొండ రోడ్‌లోని ఓ ప్రముఖ కమ్యూనిటీలో జరిగిన అగ్నిప్రమాదం రెండు నుంచి మూడు అంతస్తుల వరకూ వ్యాపించింది. ప్రమాదం సమయానికి నియంత్రించబడటంతో పెద్ద నష్టం తప్పింది.
ఈ ఘటనలు హై-రైజ్ నిర్మాణాల భద్రత ప్రమాణాలపై మళ్లీ చర్చ మొదలయ్యేలా చేశాయి. అగ్నిసురక్షా చర్యలను మరింత కఠినతరం చేయడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో బయటపడే మార్గాలను, సేఫ్టీ ఆడిట్లను నిర్లక్ష్యం చేయరాదని నిపుణులు సూచిస్తున్నారు. హాంకాంగ్ ప్రమాదం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి కీలక పాఠంగా నిలిచే అవకాశం ఉంది.
